Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

గులాంనబీ ఆజాద్‌ కొత్త పార్టీ పేరు.. డెమోక్రటిక్‌ ఆజాద్‌

గులాంనబీ ఆజాద్‌ కొత్త పార్టీ ప్రకటించారు. కొత్త పార్టీ పేరును ఆయన డెమోక్రటిక్‌ ఆజాద్‌గా నామకరణం చేశారు. అలాగే ఆజాద్‌ పార్టీ జెండాను కూడా ఆవిష్కరించారు. పార్టీ పేరును ప్రకటించడం, పార్టీ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.కాంగ్రెస్‌ పార్టీతో తెగదెంపులు చేసుకున్న నెల రోజుల తర్వాత ఆయన సొంత పార్టీని స్థాపించినట్టయింది. తమకంటూ స్వతంత్ర ఆలోచన, సిద్ధాంతాలు ఉంటాయని అజాద్‌ ప్రకటించారు. తమది ప్రజాస్వామ్య పార్టీ అవుతుందన్నారు. ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేసుకోవడం తదుపరి ప్రాధాన్యతగా చెప్పారు. ఎన్నికలు ఎప్పుడైనా జరగొచ్చనీ, తమ రాజకీయ కార్యకలాపాలు కొనసాగుతాయనీ అన్నారు. నీలం, తెలుపు, పసుపు రంగుల కలయికతో అజాద్‌ పార్టీ జెండా రూపుదిద్దుకుంది. ‘‘ఇందులో పపుసు రంగు అన్నది సృజనాత్మకత, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. తెలుపు అన్నది శాంతికి చిహ్నం. నీలం రంగు స్వేచ్ఛ, ఊహలకు ప్రతిరూపం’’ అని అజాద్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img