Monday, May 6, 2024
Monday, May 6, 2024

న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంచండి: సుప్రీం

కోర్టుల్లో పిటిషన్లు వేసి, సామాజిక మాధ్యమాల్లో అవే అంశాలపై సమాంతరంగా చర్చలు జరపడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండాలని పెగాసస్‌ స్పైవేర్‌తో కొందరిపై నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది. పెగాసస్‌తో నిఘా ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సోమవారం వరకు గడువు ఇచ్చింది. ఈ కేసులో ఎవరూ తమ హద్దుల్ని దాటవద్దు అని, ప్రతి ఒక్కరికీ అవకాశం ఇస్తామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండాలని పిటిషనర్లతో అన్నారు. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే, కోర్టులో చెప్పండి అంటూ పేర్కొన్నారు. ఒకసారి మీరు కోర్టుకు వస్తే, అప్పుడు కోర్టులో సమగ్రమైన చర్చ జరుగుతుందన్నారు.కోర్టు పర్యవేక్షణలో పెగాసస్‌పై విచారణ చేపట్టాలని పలువురు సుప్రీంలో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img