Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

భారతీయ విద్యార్థులను పక్షపాతంతో చూడకూడదు: కాంగ్రెస్‌

న్యూదిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల రక్షణపై సోమవారం కాంగ్రెస్‌ ఆందోళన వ్యక్తం చేసింది. వారిని వెనక్కి రప్పించడంలో ఎలాంటి పక్షపాతం చూపకూడదని ప్రభుత్వాన్ని కోరింది. మానవత్వంలో ఉక్రెయిన్‌లోని పౌరులను తరలించాలని డిమాండ్‌ చేసింది. ‘ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి కాంగ్రెస్‌ ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది. అమాయకుల ప్రాణనష్టం, పెద్ద స్థాయిలో ధ్వంసం, ప్రజల భారీ వలసలు, తీవ్రమైన మానవ బాధలు ఆమోదయోగ్యం కాదు. యుద్ధక్షేత్రంలో చిక్కుకున్న వేలాది మంది విద్యార్థులు, పౌరుల గురించే మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం’ అని కాంగ్రెస్‌ తెలిపింది. అన్ని పోరాటాలకు తక్షణం ముగింపు పలికి, రెండు పక్షాలతో గౌరవించబడే సురక్షితమైన తరలింపు కోసం భౌగోళికంగా నిర్వచించబడిన మానవతా కారిడార్‌లను రూపొందించాలని కాంగ్రెస్‌ పార్టీ విజ్ఞప్తి చేస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌, నాటో శాంతిని పునరుద్ధరించడానికి, అన్ని సమస్యలకు శాశ్వర పరిష్కారం చూపే దిశగా నిజాయతీగా చర్చలు జరపాలని కోరుతున్నాం’ అని కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img