Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

భారత్‌లో కొత్తరకం కరోనా వేరియంట్‌ కలకలం.. !

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొత్త రకం కరోనా వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది. బీహార్‌ ఆరోగ్య శాఖ అధికారులు కరోనా కొత్త సబ్‌ వేరియంట్‌ను గుర్తించారు. ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఐజీఐఎంఎస్‌)లో ఈ కొత్త వేరియంట్‌ బీఏ.12 బయటపడిరది. ఇది కరోనా థర్డ్‌ వేవ్‌లో వెలుగుచూసిన బీఏ.2 సబ్‌ వేరియంట్‌కంటే పదిరెట్లు ప్రమాదకరమని అధికారులు చెబుతున్నారు. ఆందోళన చెందాల్సిన పనిలేదని, తగి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీఏ.12 సబ్‌ వేరియంట్‌ను మొదట యూఎస్‌లో గుర్తించారు. ఢల్లీిలో ఈ సబ్‌వేరియంట్‌కు సంబంధించిన మూడు కేసులు వెలుగుచూశాయి.దేశంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ 13 శాంపిళ్లను పరీక్షించగా అందులో ఒకటి బీఏ.12 సబ్‌ వేరియంట్‌గా తేలిందని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img