Monday, April 29, 2024
Monday, April 29, 2024

మహిళ ఫొటోతో బ్లాక్‌మెయిల్‌

నరేంద్రగిరి సూసైడ్‌నోట్‌లో ఆశ్చర్యకర అంశాలు
ప్రయాగ్‌రాజ్‌: అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి అనుమానాస్పద మృతి తర్వాత నిర్ఘాంతపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నరేంద్రగిరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అతిథి గృహంలో పోలీసులకు లభించిన సూసైడ్‌ నోట్‌లో అనేక విస్తుపోయే విషయాలు వెల్లడిరచినట్లు తెలుస్తోంది. తన శిష్యుడు ఆనంద్‌ గిరి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడిరచారు. ఆనంద్‌గిరి కారణంగా తీవ్ర మనోవేదనకు గురయ్యానని, సెప్టెంబరు 13వ తేదీన చనిపోవాలనుకున్నానని, కానీ ధైర్యం సరిపోలేదని నరేంద్రగిరి సూసైడ్‌నోట్‌లో తెలిపారని చెప్పారు. కంప్యూటర్‌ సాయంతో ఓ మహిళతో తాను కలిసి ఉన్నట్లు చూపే ఫొటోను తయారు చేసి తనను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఆనంద్‌గిరి సిద్ధమైనట్లు తెలిసిందని, ఇది తనను కలవరపెడుతోందని వెల్లడిరచారు. ఇప్పటివరకు చాలా గౌరవంగా జీవించానని, ఇలాంటి అపఖ్యాతితో జీవించలేనని, అందుకే తనువు చాలిస్తున్నానని నరేంద్రగిరి మృతదేహం వద్ద లభించిన సూసైడ్‌ నోట్‌లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. తన ఆత్మహత్యకు శిష్యుడు ఆనంద్‌గిరితోపాటు మరో ఇద్దరు కారణమని నరేంద్రగిరి ఆ నోట్‌లో వెల్లడిరచినట్లు సమాచారం. ఆధ్య తివారితోటు అతడి కుమారుడు సందీప్‌ తివారి కూడా కారణమని అందులో రాసినట్లు పోలీసు వర్గాలు వెల్లడిరచాయి. తన మరణానికి కారణమైన వారిపై ప్రయాగ్‌రాజ్‌ పోలీసులు చర్యలు చేపట్టాలని, అప్పుడే తన ఆత్మ శాంతిస్తుందని నరేంద్రగిరి సూసైడ్‌ నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. ఆయన పేర్కొన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మహంత్‌ నరేంద్రగిరి సోమవారం అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని బాఘంబరి మఠం అతిథి గృహంలో పైకప్పునకు వేలాడుతూ ఆయన మృతదేహం కనపడినట్లు పోలీసులు వెల్లడిరచారు. ఆ గదిలో 8 పేజీల లేఖ లభించిందని, అది మహంత్‌ నరేంద్ర రాసినదిగా భావిస్తున్నామని ప్రయాగ్‌రాజ్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కేపీ సింగ్‌ తెలిపారు. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే ఆశ్రమంలోని శిష్యులను విచారించగా అనుమానాస్పద విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img