Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మహిళా హక్కుల కార్యకర్త కమలాభాసిన్‌ కన్నుమూత

న్యూదిల్లీ : ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త కమలా భాసిన్‌ (75) శనివారం కన్నుమూశారు. ఆమె ప్రముఖ స్త్రీవాది, రచయిత. భారత్‌, దక్షిణాసియా దేశాల్లో మూడు దశాబ్దాలుగా లింగ వివక్ష, అభివృద్ధి, శాంతి, మానవ హక్కులు వంటి సమస్యలపై పోరాడారు. దక్షిణాసియాలో ‘వన్‌ బిలియన్‌ రైజింగ్‌’ ప్రచారంతో పాటు అనేక ముఖ్యమైన ఉద్యమాల్లో ఆమె పాల్గొన్నారు.
తనను తాను శిక్షణ సామాజిక శాస్త్రవేత్తగా ఆమె అభివర్ణించుకున్నారు. స్త్రీవాదం, మహిళల సమస్యలపై ఆమె చాలా పుస్తకాలు రాశారు. ఆమె మృతిపై సోషల్‌ మీడియాలో సంతాపాలు వెల్లువెత్తాయి. ‘కమలా భాసిన్‌ కేవలం సామాజిక కార్యకర్త మాత్రమే కాదు. పరోపకారి కూడా. రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటుకు సాయపడ్డారు. ఆమె మరణం తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి జరగాలని ప్రముఖ న్యాయవాది-సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ భూషణ్‌ ట్వీట్‌ చేశారు. ఆమె మృతికి అనేకమంది ప్రముఖులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img