Monday, May 6, 2024
Monday, May 6, 2024

లాలూ ప్రసాద్‌, ఆయన భార్యకు దిల్లీ హైకోర్టు సమన్లు

భారత రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఐఆర్సీటీసీ కుంభకోణం ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను వదలడం లేదు. ఇదే కేసులో తాజాగా ఆయనకు, ఆయన భార్య రబ్రీదేవికి ఢల్లీి హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఆయన కుమార్తె మీసా భారతితో పాటు మరో 11 మంది నిందితులకు కూడా సమన్లు పంపింది. మార్చి 15వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. కేసు వివరాల్లోకి వెళ్తే… ఇది యూపీఏ-1 ప్రభుత్వ హయాంలో చోటుచేసుకుంది. బీహార్‌లోని అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములను తీసుకుని, వారికి రైల్వే శాఖలో ఉద్యోగాలను ఇప్పించారని వీరిపై సీబీఐ కేసు నమోదు చేసింది. మరోవైపు ఇటీవలే సింగపూర్‌లో లాలూ ప్రసాద్‌ కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నారు. చికిత్స అనంతరం ఇండియాకు తిరిగి వచ్చిన ఆయనకు దిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img