Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

విమానాశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్‌ సేవలకు రూ.2430 కోట్ల్లు

న్యూదిల్లీ: విమానాశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్‌ అందిస్తున్న భద్రతా సేవలకు సంబంధించి గత రెండేళ్లలో విమాన ప్రయాణికుల నుంచి రూ.2,430 కోట్లకు పైగా వసూలు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. విమానాశ్రయాలలో సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) అందించే సేవలకు చెల్లింపు… జాతీయ విమానయాన భద్రతా రుసుము ట్రస్ట్‌ (ఎన్‌ఏఎస్‌ఎఫ్‌టి)కు ఏవియేషన్‌ సెక్యూరిటీ ఫీజు (ఏఎస్‌ఎఫ్‌) రూపంలో జమ చేయబడే విమాన ప్రయాణ టికెట్లపై వసూలు చేసిన చార్జీల నుండి చేయబడుతుంది. ఏప్రిల్‌ 2020 నుంచి డిసెంబర్‌ 2021 వరకు మొత్తం రూ.2430.48 కోట్లు ఏఎస్‌ఎఫ్‌గా వసూలు చేశామని, అందులో రూ. 1885.74 కోట్లు చెల్లింపు చేసినట్లు ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో రాయ్‌ తెలిపారు. ప్రస్తుతం 65 విమానాశ్రయాల్లో 30,996 మంది సిబ్బందితో సీఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img