Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సామాజిక ఆడిట్‌ పరిధిలోకి పౌరసేవలు : విజయన్‌

తిరువంతనంపురం : పౌర సేవలను సామాజిక ఆడిట్‌ పరిధిలోకి తప్పకుండా తీసుకురావాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్‌ పేర్కొన్నారు. సమర్థవంతమైన, అవినీతి రహిత పాలనే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వానికి చెందిన కార్యాలయాల్లో తమకు అర్హత ఉన్న సేవలను వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్నారు. ప్రస్తుతం ఉన్న నియమ, నిబంధనల్లో సమూలమార్పులు తేవాలని చూస్తున్నామన్నారు. అలాగే ఇలాంటి నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేస్తే సామాన్యులకు ఇబ్బందులు తప్పుతాయో అధికారులు కూడా తన దృష్టికి తేవాలన్నారు. ‘ఒకవైపు పౌర సేవలను మరింతగా మెరుగుపరచడం, మరోవైపు ఆ సేవలను సామాజిక ఆడిట్‌ పరిధిలోకి తీసుకువచ్చేలా చూడాలి’ అని పేర్కొన్నారు. ‘నవ కేరళం పౌర సేవ’ అనే కార్యక్రమ సింపోజియంను ప్రారంభించడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ‘నవ కేరళం పౌర సేవ’ కార్యక్రమాన్ని ప్రముఖ సేవా సంస్థలైన కేరళ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌, నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా చేట్టాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img