Friday, April 26, 2024
Friday, April 26, 2024

మైనారిటీ మహిళపై దాడి దారుణం

న్యాయం జరిగేంత వరకూ పోరాటం
నారాయణరెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి

గూడూరు : చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామంలో షాకీరా అనే ముస్లిం వివాహితపై గడ్డపారతో దాడికి పాల్పడిన లక్ష్మినారాయణ రెడ్డి, అతని తనయుడు వంశీరెడ్డిలపై హత్యాతయ్నం కేసు నమోదు చేయాలని గూడూరు పట్టణ మైనారిటీ సంఘాలు డిమాండ్ చేశాయి. బుధవారం సాయంత్రం గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షాకీరాను మైనారిటీ సంఘాల నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ. మగ్దూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ ఒక మైనారిటీ మహిళపై దాడికి పాల్పడడం అమానుషమన్నారు. వెంటనే అతనిని పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై షాకీరా కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో డిప్యూటీ సీఎం, సీఎంల దృష్టికి తీసుకెళతామన్నారు. ఇన్సాఫ్ సమితి రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ షేక్. జమాలుల్లా మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలోనూ రాయలసీమ తరహాలో ఫ్యాక్షనిజం పెచ్చుమీరుతోందన్నారు. అధికారపక్షంలో ఉంటే ఏమైనా చేసేయొచ్చు. అనేందుకు నిలువెత్తు నిదర్శనం ఈ సంఘటన అన్నారు. వెంటనే నారాయణ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ మైనారిటీ నాయకులు ఎండీ. అన్వర్ బాష మాట్లాడుతూ బుధవారం ఉదయం దాడి చోటుచేసుకుంటే ఇప్పటి వరకూ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. వెంటనే నారాయణ రెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ తిరుపతి పార్లమెంటు కార్యదర్శి షేక్ కాలేషా, వైసీపీ మైనారిటీ నాయకులు అల్తాఫ్, జమీర్, మైనారిటీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ కే. జీలానీ బాష, ఈద్గాహ్ యూత్ అధ్యక్ష, కార్యదర్శులు షేక్. షబ్బీర్, షేక్. యస్థానిబాష, ఇన్సాఫ్ సమితి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్. చానా బాష, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img