Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆఫ్రికాలో విస్తరిస్తున్న అమెరికా సైన్యం

ఐలీన్‌ వైట్‌ హెడ్‌

ఆఫ్రికాలో ఏమి జరుగుతుందో తెలియడం చాలా కష్టం. చివరకు మీడియా సైతం ఆఫ్రికాలో జరుగుతున్న పరిణామాలను గురించి రాసేది అతి స్వల్పం. అయితే ఇక్కడ జరిగే కార్యకలాపాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంటుంది. ఇదే అవకాశం తీసుకొని అమెరికా అక్కడ వాలిపోయింది. ఈ ప్రాంతంలో రాజకీయ కార్యకలాపాలు అర్థం చేసుకొంటేనే అమెరికా సైనిక స్థావరాలను ఎందుకు ఏర్పాటు చేసిందీ తెలుస్తుంది. అంతర్జాతీయ జోక్యానికి ఎక్కువగా గురవుతోన్న దేశాలలో ఉగాండ, సూడాన్‌, దక్షిణ సూడాన్‌, కెన్యా, ఎరిట్రియ, దిగ్బౌటి, ఇథియోపియా, సొమాలియ. ఇతర దేశాల జోక్యం వల్ల ఈ దేశాల్లో తీవ్ర అస్థిరీకరణకు గురవుతున్నాయి. దిగ్బౌటి, ఎరిట్రియ నుండి సొమాలియ, ఇథియోపియ వరకు ఎప్పుడూ ఘర్షణ వాతావరణమే ఉంటోంది. పాశ్చాత్య సామ్రాజ్యవాద దేశాలు నియంతలైన పాలకులకు సహాయం అందజేస్తూ, ఏ దేశం స్వాతంత్య్రం కోసం పోరాటం చేయకుండా అడ్డుకుంటున్నాయి. పాశ్చాత్య దేశాల అండదండలతో ఇరాన్‌నే గాక ఈ ప్రాంతంలోని అన్ని దేశాలను యుద్ధ క్షేత్రాలుగా మార్చివేశాయి. అమెరికా సేనలు అన్ని దేశాలకూ విస్తరిస్తున్నాయి.
ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత అమెరికాలో శక్తిమంతమైన శక్తులు పెత్తనం చెలాయించాలన్న ‘లక్ష్యం’ తో ఈ ప్రాంతానికి ఒక స్వరూపాన్నిచ్చి ఏక ధృవ ప్రపంచాన్ని నెలకొల్పి ఇతర దేశాలు తమ కనుసన్నల్లో మెలగాలని కోరుకున్నాయి. ఇందుకోసం కొన్ని ప్రాంతాలుగా విడగొట్టి ఆ ప్రాంతాల్లో తమ ప్రభావాన్ని విస్తరించేందుకు పథకం రూపొందించాయి. ఈ శక్తులు చెప్పినట్టు వినే దేశాలు కొన్ని ఉన్నాయి. తప్పుదారి పట్టించే విధానాల వల్లనే ప్రపంచ వ్యాప్త, ప్రాంతీయ సంక్షోభాలు తలెత్తేందుకు ప్రధాన కారణం. ఆఫ్రికా ప్రారంభ దేశాల్లో ఎల్లవేళలా కల్లోల పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ప్రాంతం భౌగోళిక రాజకీయాలలో చాలా కీలకమైనది. అందువల్లనే అమెరికా ఇక్కడ జోక్యం చేసుకొని తిష్ట వేసింది. ఎర్రసముద్రం ఒడ్డున దిగ్భౌటి రిపబ్లిక్‌ ఉంది. ఈ దేశం జల మార్గానికి ప్రారంభంలో ఉన్నది. ఈజిప్టుకు చెందిన సూయజ్‌ కెనాల్‌ ముఖ్యమైన జలమార్గం. ఈ చిన్న దేశం ఇథియోపియా, సొమాలియా, ఎరిట్రియ మధ్య ఉంటుంది.
ఈ ప్రాంతంలోని అన్ని దేశాల్లో కంటే దిగ్భౌటిలో అమెరికా సైన్యం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 4వేలకు మందికి పైగా సైనికులు ‘తాత్కాలిక’ ఏర్పాటుపై ఇక్కడ ఉన్నారు. ఆఫ్రికాలో శాశ్వతమైన అమెరికా సైనిక కేంద్రం లెమోన్నియర్‌లో ఉంది. ఇక్కడి నుంచే ఇతర ప్రాంతాలపై నిఘా, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ ఇతర టెర్రరిస్టు గ్రూపుల కార్యకలాపాల నియంత్రణ పేరుతో అమెరికా తన రహస్య కార్యకలాపాలన్నింటిని నిర్వహిస్తోంది. యెమన్‌లో సౌదీ క్రూరమైన చర్యలకు మద్దతుగా సూడాన్‌ సైనికులను పంపుతున్నప్పటికీ అమెరికా అడ్డు చెప్పకపోవటం ప్రత్యేకమైన అంశమే. దిగ్భౌటిలో ఎక్కువగా అమెరికా సైన్యం ఉన్నప్పటికీ ఆఫ్రికాలోని అన్ని దేశాలలోను సైన్యం ఉండటం గమనార్హం. ఆఫ్రికాలో స్థానిక సైన్యాన్ని తయారుచేసి ఈ ప్రాంతంలో తన మిత్ర దేశాలైన ఫ్రాన్సు తదితర దేశాలకు భద్రత, సుస్థిరత కల్పించటమే అమెరికా వ్యూహం. అమెరికా సైన్యం తిష్ట వేసి ఉన్న రెండవ ప్రధాన దేశం నైగర్‌.
అమెరికా తప్పుడు విధానాల ప్రభావం ఆఫ్రికాలోని అన్ని దేశాలపైన ఎక్కువగా ఉంది. ఈ దేశాల, ప్రజల సార్వభౌమాధికారాన్ని విచ్ఛిన్నం చేయటం, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను అణచివేయటం అనేక దేశాల ఆంతరంగిక వ్యవహారాలలో జోక్యం చేసుకోవటం, బెదిరించటం ఆయా దేశాల ప్రజలపై పెత్తనం సాగించటం, సంక్షోభాలు, సంఘర్షణలు, కల్లోల పరిస్థితులను సృష్టించటం, మాట వినని దేశాలపై ఆంక్షలు విధించటం తదితర అనేక దుర్మార్గమైన చర్యలకు అమెరికా పాల్పడుతున్నది. మతాలు, జాతుల మధ్య విభజనను సృష్టించటమే గాక అవినీతికి, తీవ్రవాదానికి, టెర్రరిజానికి కారణమవుతోంది. ఆఫ్రికాలోని అన్ని దేశాలకు అమెరికా కోలుకోలేనంతగా నష్టం కలిగిస్తోంది. లిబియాలో ప్రజాస్వామ్య అనుకూల కార్యకలాపాలను పరిరక్షించే పేరుతో ఆ దేశాన్ని నాటో దళాలు విచ్ఛిన్నం చేసేందుకు పూనుకున్నాయి. అలాగే ఇథియోపియా, ఎరిట్రియల పైన అమెరికా చర్యలు తీవ్ర దుష్ప్రభావాన్ని కలుగచేస్తున్నాయి. ఆఫ్రికా కమాండ్‌ దళాల క్రిందకు రాని దేశం ఎరిట్రియ మాత్రమే.
అనేక శతాబ్దాలుగా ఐరోపా వలస పాలన, అమెరికా, పశ్చిమ ఐరోపాల నయా వలస పాలన ప్రభావం వల్ల ఆఫ్రికా ఇప్పటికీ ఏమాత్రం అభివృద్ధి లేని, అస్థిరీకరణ ప్రాంతంగా మిగిలిపోయింది. లిబియాలో మాదిరిగానే అన్ని దేశాలలోను తప్పుడు ప్రచారాలు గావించి వనరుల దోపిడీ, ఆ ప్రాంతంలో ఉన్న సంక్లిష్టతను, చారిత్రక సందర్భాలను, వాస్తవ రాజకీయ పరిస్థితులను మరుగుపరచటం అమెరికా చేస్తున్న దుర్మార్గమైన పని.
ఆఫ్రికా ఖండంలో అమెరికా తిష్టవేసి ఉన్నంత కాలం ఈ ప్రాంతంలో సంఘర్షణలు, సైనిక పాలనలు, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నీ ప్రజాస్వామ్యానికి నోచుకోవు. అభివృద్ధి, స్త్రీ, పురుషులకు ఒకే విధమైన న్యాయం జరగదు. శాంతి, ఈ ప్రాంత భద్రత ప్రస్తుతం ఎంతైనా అవసరం. శతాబ్దాలుగా ఉన్న విధ్వంసకర, వారసత్వంగా వస్తున్న సైనికీకరణ స్థానంలో సంస్కృతులు విలసిల్లాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img