Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

నాకు నువ్వు`నీకు నేను

చింతపట్ల సుదర్శన్‌

అరుగు దిగుతూ అడిగింది డాంకీని డాగీ, ఏమిటింకా కాగితాల వేటకు బయల్ద్దేరలేదేమని, రోజూ పాలూ, పేపర్లు నమిలి బోరు కొట్టేసింది. నోటికి రుచి ఉండడంలేదు. మొన్నా నిన్నటి పేపర్లుకాకుండా ఈ వేళ్టిదైతే తాజాగా, కమ్మగా ఉంటుందేమోకాని మనకు ఎలా దొరుకుతుంది. అందుకే ఈ పూట ఏమీ తినవద్దనుకుంటాన్నా అంది డాంకీ.
ఇది టెంపరరీ వైరాగ్యమేలే ఆకలైతే నువ్వే దిగివస్తావులే అంటూ మాంసంకొట్టువైపు నాలుక్కాళ్ల వెహికల్‌నునడిపింది డాగీ. గంట గడిచిందో లేదో ఎగశ్వాసా, దిగశ్వాసా చప్పుడు చేస్తూ పరుగెత్తుకు వచ్చిన కుక్కని చూస్తూ అదేమిటలా రొప్పుతున్నావు పోలీసులు వెంటపడ్డ దొంగలాగా అసలేమైంది. అని అడిగింది గాడిద.
నోటితో పట్టుకువచ్చిన మడత విప్పని తాజా న్యూస్‌ పేపర్ని గాడిద ముందుపడేసి నీకోసమే తెచ్చా ‘ఫుల్‌ మిల్స్‌’ లాగించెయ్యి అంటూ గోడ వారన కూచుని వెనక కుడికాలిని నాలుకతోనాకుతూ మూలగసాగింది కుక్క.
అసలు ‘మ్యాటరేంటి’, ఈ పేపరేంటి అరుగుదిగుతూ అడిగింది డాంకీని డాగీ, ఏమిటింకా కాగితాలవేటకు బయల్దేరలేదేమని. రోజూ పాత పేపర్లు నమిలి బోరుకొట్టేసింది. నోటికి రుచిఉండడంలేదు. మొన్నా నిన్నటి పేపర్లు కాకుండా ఈ వేళ్టిదైతే తాజగా, కమ్మగా ఉంటుందేమోకాని మనకు ఎలా దొరుకుతుంది. అందుకే ఈ పాట ఏమీ తినవద్దనుకుంటున్నా అంది డాంకీ.
అసలు ‘మ్యాటరేంటి’ ఈ పేపరేంటి. ఆ మూలుగేమిటి అంది డాంకీ. రోడ్డుమీద టీ కోట్టుముందు ఓ గుండూరావు పేపర్‌కొని టీ తాగుతూ మడత విప్పబోతుంటే జంపుచేసి మడత విప్పకముందే నోట కరుచుకుని దౌడు తీశా అంది డాగీ. గుండూరావా ఆయనెవరు నీ కజినా అనడిగింది డాంకీ. తలమీది ఒక్క వెంట్రుక లేకపోవడంతో ఆ పేరు పెట్టాలే. కుర్చీలో ఊకబస్తాలా ఇరుక్కుపోయి లేవలేక కిందకివంగి కంకర్రాయితో కొట్టాడు కాలికి తగిలిందిలే. వాడెక్కడ వెనకపడతాడో అని రేసు గుర్రంలా వచ్చా నీ కోసం తాజా పేపరు తెచ్చా అంది డాగీ. తప్పుకదా మరొకరి పేపరు ఎత్తుకురావడం అని కోప్పడిరది డాంకీ పేపర్‌ ఒకరి సొత్తుకాదు. కొన్న వాడే చదవాలని రూల్‌లేదు. బస్సుల్లో చూడు ఎన్నిచేతులు మారుతుందో. ఆ గుండుకి ఇది ‘టైంపాస్‌’కి అయితే నీకు కడుపునింపే ఆహారం. ‘నేరం నాదికాదు నీ ఆకలిది’ అంది డాగీ కాలునొప్పి తగ్గడంతో హుషారుగా.
‘ఎ ఫ్రెండ్‌ ఇన్‌ నీడ్‌ ఈజ్‌ ఎ ఫ్రెండ్‌ ఇన్‌ డీడ్‌’ అన్నారు ఇంగ్లీషులో. అవసరానికి పనికి వచ్చేవాడే ఫ్రెండ్‌ అంది డాంకీ మడతవిప్పని పేపర్‌ని తన్మయంగా చూస్తూ. అవును. నాకు నువ్వు నీకు నేను అనేపద్ధతి పాటిస్తే అసలు ఏ గొడవా ఉండదు అంతా సజావుగా సాగిపోతుంది అన్నాడు అబ్బాయి అరుగు ఎక్కుతూ. ఎన్నడూ లేంది ఇంత పొద్దున్నే వచ్చావన్నా ఇక్కడ ధర ఎక్కువని పొరుగు రాష్ట్రం నుంచి మందు తెచ్చుకున్నావా అంది డాగీ. ఛఛ మధ్యాహ్నం పూట మందుకొట్టడానికి తాగుబోతుని కాదు నేను దారంటపోతూ పలకరిద్దామని వచ్చానంతే అన్నాడు అబ్బాయి. అవునూ ఇందాక ఏమన్నావు నాకునువ్వు నీకు నేను అనే పద్ధతి పాటిస్తే, గొడవే ఉండదని కదా అదేమిటో కాస్త ‘క్లారిటీ’ ఇస్తావా అంది డాంకీ. ఇప్పుడు నేనన్నది నువ్వు వింటే నువ్వన్నది నేను ఊ అంటే అసలు గొడవే ఉండదు కదా. ఈ పద్ధతి కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాన్ని మెరుగు పరచడమేకాదు, బలపరుస్తుంది కూడా అన్నాడు అబ్బాయి.
అర్థమైంది అర్థమైంది అప్పుడప్పుడు ఇటువారు గాలిలో ఎగిరి వెళ్లి అటువారికి శాలువా కప్పి బొకే ఇచ్చివస్తే రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది అంతేకదా అంది డాగీ. అవును మరి అదికావాలి ఇదికావాలి అని ఆడగడానికి కాకుండా కేవలం మర్యాద పూర్వకంగా కల్సిరావడమే కలిసి వచ్చే విషయం. అనేక ఆస్తులతోపాటు అనేక లొసుగులూ ఉంటాయి. తుప్పు పట్టని పాత అప్పులూ ఉంటాయి. తిప్పలు పడకుండా ఉండాలంటే అటువాడికికోపం తెప్పించవద్దుకదా. తనకోపమేకాదు అవతలవాడి కోపమూ శత్రువేకదా అన్నాడు అబ్బాయి. ప్రజలు అడిగారని ప్రతిపక్షం అరిచారని హోదా కావాలి, ప్రాజెక్టులు పూర్తవడానికి నిధులు కావాలని నస పెట్టొద్దు. మీకేది చెయ్యాలనిపిస్తే అదే చెయ్యండి మీకేది అమ్మాలని పిస్తే అది అమ్మి పారెయ్యండి. మాటవరసకి మేమేదన్నా అన్నా అది ఉత్తుత్తిదే. సీరియస్‌ అవకుండా తేలిగ్గా కొట్టిపారేయండి అనాలంటూవు అంది డాంకీ.
మీరిద్దరే ‘ఒపీనియన్స్‌ ఎక్స్‌చేంజ్‌’ చేసుకుంటార నన్నూ చెప్పనీండి. నా జోలికి రాకపోతే నేను ఎవరిమీదా మొరగను, కరవను. ఎవరైనా తలనిమిరారనుకో ఆనందంగా తోకఊపుతా. రాయితోకొట్టిన ఆ గుండూ రావుకు బొడ్డుచుట్టూ ఇంజక్షన్లు పొడిపించుకునే గతిపట్టిస్తా అంది డాగీ.
దీన్నే ‘క్విడ్‌ ప్రోకో’ అంటారనుకుంటా. దానికిది దీనికది అన్నమాట. అసలీలోకంలో దీని అవసరంలేని దెవరకి. ఆస్తులూ,పదవులూ కాపాడుకోవాలనుకునేవారికి మరీనూ అంది డాంకీ. అవును ‘లివ్‌ ఎండ్‌ లెట్‌లివ్‌’ అంటారు కదా. నీ తప్పునేను కాస్తా, నువ్వు ఊపు తలకాయి అన్నమాట అన్నాడబ్బాయి. నేను నీకు తాజా పేపర్‌ తెచ్చిస్తే నాకునువ్వు బోలెడు ‘ఇన్‌ఫర్మేషన్‌’ ఇస్తావు నన్ను ‘ఎడ్యుకేట్‌’ చేస్తావు. మనది రాజకీయాలకు సంబంధంలేని అనుబంధం ‘యూ ఆర్‌ మైౖ డియర్‌ ఫ్రెండ్‌, ఫిలాసఫర్‌ అండ్‌ డాంకీ’ అంది డాగీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img