Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రత్యేక స్పందనకు విశేష స్పందనతో అర్జీలు

విశాలాంధ్ర చీమకుర్తి : ఎస్సీ ఎస్టీల నుంచి వచ్చిన అర్జీలను సమగ్రంగా విచారించి పరిష్కరించాలని కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ ఆదేశించారు. సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక స్పందన కార్యక్రమం శుక్రవారం చీమకుర్తిలోని బివిఆస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగింది. ఎస్సీ ఎస్టీ ప్రత్యేక స్పందనకు విశేష స్పందన లభించింది. బాధిత ప్రజల నుంచి 179 అర్జీలు నమోదయ్యాయి.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్నందున నియోజకవర్గాల వారీగా ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక స్పందనలో అర్జీలకు పరిష్కారం జరగకపోతే అధికారులు మరోసారి విచారణ చేయాలని ఆయన ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభ్యున్నతి కోసం అధికారులు ఉత్తమ సేవలు అందించాలని ఆయన సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని గ్రామ, వార్డు సచివాలయాల్లో నమోదుచేసి ఫిర్యాదుదారులకు ధ్రువీకరించాలన్నారు. సచివాలయల వారీగా అర్జీలను నమోదు చేయక పోయినా, పరిష్కారానికి చర్యలు తీసుకోక పోయినప్పటికీ బాధ్యులను సస్పెండ్ చేస్తానని కలెక్టర్ హెచ్చరించారు. సచివాలయాల స్థాయిలో పరిష్కారం కావాల్సిన అర్జీలు జిల్లా కేంద్రానికి రావడం సరికాదన్నారు. ప్రస్తుతం నాణ్యతతో అర్జీల పరిష్కారం జరుగుతుందని అదే స్ఫూర్తితో అధికారులు పని చేయాలన్నారు.
ఆజాదీ కా అమృత్ ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు ఒకటి నుంచి 15వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 75 ఏళ్ళు గడిచిన నేపద్యంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. వేడుకల నిర్వహణపై ప్రభుత్వం నుంచి షెడ్యూల్డ్ విడుదల అయ్యిందన్నారు. “ఇంటింటికి జెండా” కార్యక్రమంలో జిల్లా పరిషత్, పంచాయతీ, డి ఆర్ డి ఎ, మెప్మాశాఖల అధికారులు భాగస్వాములై సమన్వయంతో వేడుకలు నిర్వహించాలనన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పదిహేను రోజులపాటు ప్రణాళికాబద్ధంగా పండుగ వాతావరణంలో ఉత్సవాలు జరపాలన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విస్తృత ప్రచారం చేయాలన్నారు. సచివాలయాల స్థాయిలో సిబ్బంది, వాలంటీర్ల ద్వారా జెండాల పంపిణీ కార్యక్రమం త్వరలో చేపట్టాలన్నారు. బ్రిటిష్ పాలన తదుపరి స్వాతంత్రంతో జరిగిన అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా వివరించాలన్నారు. ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించాలని, వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా మరింత అప్రమత్తం కావాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ ఎస్ సరళ వందనం జడ్ పి సీఈఓ బి జాలిరెడ్డి ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు ఉప కలెక్టర్ గ్లోరియా సీపీఓ జి వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img