Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం

విశాలాంధ్ర – కనిగిరి : విద్యా సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతమైనదని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ పవన్ కళ్యాణ్, పట్టణ కన్వీనర్ ఇఫ్రాజ్ అన్నారు. మంగళ వారం కనిగిరి లో విద్యాసంస్థలు బంద్ కార్యక్రమం జరిగింది. విద్యార్థులను ఇబ్బందులు కలిగించే జీవో నెంబర్ 84, 85, 114, 126 జీవోలను రద్దుచేసి జాతీయ విద్యా విధానం 2020 ను రద్దు చేయాలని అదేవిధంగా మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలల విలీనం చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగినది. హాస్టల్ విద్యార్థులకు పెరిగిన నిత్యవసర వస్తువులు ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు కాస్మోటిక్ చార్జీలను పెంచాలని ,విద్యా దీవెన, వసతి దీవెనలను అందరికీ అందించాలని అన్నారు. అదేవిధంగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి 25,000 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. బస్ పాసులను పెంచి విద్యార్థులకు భారాన్ని కలిగించే ప్రభుత్వ విధానాలను విద్యా విధానాలకు స్వస్తిపలకాలని పవన్ అన్నారు. పట్టణంలో ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలో కాలేజీలను ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు మూసివేయడం జరిగినది పట్టణంలో ప్రదర్శన నిర్వహించి విద్యా సమస్యల పరిష్కారం కోసం జరిగే రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని పురవీధులలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రాము, సురేషు, రామాంజనేయులు ,మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img