Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

క్రికెట్‌కు స్టెయిన్‌ గుడ్‌బై !

న్యూదిల్లీ : సౌతాఫ్రికా పేస్‌ దిగ్గజం డేల్‌ స్టెయిన్‌ అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి వీడ్కోలు పలుకుతున్నట్లు మంగళవారం తెలిపాడు. ట్విటర్‌ వేదికగా తన క్రికెట్‌ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలతో పాటు రిటైర్మెంట్‌ ప్రకటనను అభిమానులతో పంచుకున్నాడు. సౌతాఫ్రికా తరపున 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ20 ఆడిన స్టెయిన్‌.. సుదీర్ఘ ఫార్మాట్‌లో 439 వికెట్లు.. వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు తీశాడు. ఇక గాయాలతో తెగ ఇబ్బందిపడిన స్టెయిన్‌ రెండేళ్ల క్రితమే( 2019లోనే) సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. 2005లో ఆసియా ఎలెవన్‌, సౌతాఫ్రికా ఎలెవన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేల్లోకి అడుగుపెట్టిన స్టెయిన్‌.. 2013లో పాకిస్థాన్‌పై (6/39) అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. 2007లో న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌ ఆడిన స్టెయిన్‌, వెస్టిండీస్‌తో జరిగిన తన రెండో మ్యాచ్‌లోనే(4/9) కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ ఇచ్చాడు. 2019లో శ్రీలంకతో చివరి వన్డే ఆడిన ఈ సౌతాఫ్రికా పేస్‌ దిగ్గజం.. గతేడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో చివరి టీ20 ఆడాడు. ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్‌ ఆడి రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అంతా భావించినా.. ఆ అవకాశం లేకపోవడంతో ముందుగానే ఆటకు అల్విదా ప్రకటించాడు. తనకు ఇష్టమైన ఆటకు ఈ రోజు అధికారికంగా గుడ్‌ బై చెబుతున్నానని, 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలని స్టెయిన్‌ పేర్కొన్నాడు. ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలున్నా యన్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్స్‌లో కూడా స్టెయిన్‌ దుమ్ము రేపాడు. భారత క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు. డెక్కన్‌ చార్జర్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ లయన్స్‌ తరఫున బరి లోకి దిగాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌లో ఆర్‌సీబీ తరపున ఆడిన స్టెయిన్‌ ఐపీఎల్‌ 2021 సీజన్‌కు దూరంగాఉన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img