Monday, May 6, 2024
Monday, May 6, 2024

మహిళల టీ20 ప్రపంచకప్‌ నేడు సెమీస్‌లో భారత్‌`ఆసీస్‌ ఢీ

ముంబై: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ తుది అంకానికి మరో అడుగు దూరంలో ఉంది. రెండు గ్రూపుల నుంచి సెమీఫైనల్‌ బెర్తులు ఖరారు అయ్యాయి. గ్రూప్‌-1లో ఆస్ట్రేలియా, గ్రూప్‌-2లో ఇంగ్లండ్‌ జట్లు వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచాయి. మొదటి గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, రెండో గ్రూప్‌లో భారత్‌ రెండో స్థానంలో ఉన్నాయి. వీటిలో ఏయే జట్లు సెమీస్‌ పోరులో తలపడనున్నాయో తెలుసా..? మొదటి సెమీ ఫైనల్లో ఫిబ్రవరి 23న భారత్‌, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మరుసటి రోజు (ఫిబ్రవరి 24న) ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా రెండో సెమీఫైనల్‌ ఆడతాయి. వీటిలో ఏ టీమ్‌లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐర్లాండ్‌తో కీలకమైన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత్‌ అదరగొట్టింది. ఓపెనర్‌ స్మృతి మంధాన హాఫ్‌ సెంచరీ (87) బాదడంతో 155 రన్స్‌ చేసింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఐదు పరుగులతో ఐర్లాండ్‌పై గెలుపొందింది. ఆరు పాయింట్లతో సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకుంది. పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా సెమీఫైనల్‌ చేరడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 2009, 2010, 2018లో భారత జట్టు సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌ జట్టు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 వరల్డ్‌ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (81), వ్యాట్‌ (59) ఇద్దరూ అర్ధ శతకాలతో చెల రేగడంతో 5 వికెట్ల నష్టానికి 213 చేసింది. ఛేజింగ్‌లో పాకిస్థాన్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 99 రన్స్‌ చేసిందంతే. దాంతో, ఇంగ్లడ్‌ 114రన్స్‌తో విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img