Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

విమర్శించే వారికి ఇక్కడ జరిగేది తెలియదు


బోర్డర్‌ వ్యాఖ్యలపై ఆసీస్‌ వికెట్‌కీపర్‌ స్పందన
దిల్లీ: నాగ్‌పూర్‌ టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ వ్యవహార శైలిపై ఆసీస్‌ మాజీ సారథి అలెన్‌ బోర్డర్‌ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. స్మిత్‌… జడేజా, అశ్విన్‌ లను బాగా బౌలింగ్‌ చేసినప్పుడు వారికి బాగా వేశావని ‘థమ్సప్‌’చూపించడం ఆయనకు కోపం తెప్పించింది. ఏం సాధించావని అలా థమ్సప్‌ చూపిస్తున్నావని బోర్డర్‌ విమర్శలు చేశాడు. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌ వేదికగా ముగిసిన తొలి టెస్టులో కంగారూలు ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ టెస్టులో భారత స్పిన్‌ త్రయం రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ల స్పిన్‌ ఉచ్చులో చిక్కుకున్న ఆసీస్‌… రెండు ఇన్నింగ్స్‌లలో దారు ణంగా విఫలమైంది. మరీ ముఖ్యంగా భారత్‌ లో మంచి రికార్డు ఉన్న స్టీవ్‌ స్మిత్‌… స్పిన్‌ ను బాగా ఆడగలడన్న పేరున్న లబూషేన్‌ లతో పాటు మిడిలార్డర్‌ బ్యాటర్లు హ్యాండ్స్‌కాంబ్‌, అలెక్స్‌ క్యారీలు ఘోరంగా విఫలమయ్యారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి ఒక్క ఆసీస్‌ బ్యాటర్‌ కూడా అర్ధ సెంచరీ చేయకపోవడం గమ నార్హం. స్మిత్‌ బ్యాటింగ్‌పై బోర్డర్‌ మాట్లా డుతూ.. ‘భారత పిచ్‌లపై ఎడ్జ్‌ రాకుండా బ్యాటింగ్‌ చేయాలి. భారత స్పిన్నర్లు ఆఫ్‌ స్టంప్‌ అవతల బాల్‌ వేసి, నిన్ను బీట్‌ చేసిన ప్రతీసారి వాళ్లకు థమ్సప్‌ చూపిస్తున్నావు. అసలు ఇదేం పిచ్చి. బుద్ధి ఉండే ఈ పని చేస్తున్నావా. ఆస్ట్రేలియా ఎప్పుడూ అగ్రెసివ్‌ క్రికెట్‌ ఆడుతుంది. ప్రత్యర్థి బౌలర్లకు థమ్సప్‌ ఇవ్వడమనేది చెత్త పని. ఆ సమయంలో నీ వీక్‌నెస్‌ బౌలర్లకు అర్థమై పోతోంది. ఇండియా టూర్‌ ఎలా ఉండబోతుందో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇంకా మూడు టెస్టులు ఆడాలి. చాలా కఠినమైన పిచ్‌లను ఫేస్‌ చేయాలి’అని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా ఆ జట్టు వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ స్పందించాడు. బోర్డర్‌ ను తాము గౌరవిస్తామని, కానీ ఇక్కడ ఏం జరుగుతోందనేది విమర్శ కులకు తెలియదని చెప్పాడు. క్యారీ మాట్లా డుతూ… ‘మేం అలెన్‌ బోర్డర్‌ ను గౌరవిస్తాం. ఆయన లెజెండ్‌. బయట నుంచి కామెంట్స్‌ చేసేవాళ్లకు డ్రెస్సింగ్‌ రూమ్‌ లో ఏం జరుగుతుందో తెలియదు. మేం భిన్నంగా ఆడేందుకు యత్నిస్తూనే ఉన్నాం. కొన్ని కొన్నిసార్లు పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవచ్చు’ అని తెలిపాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img