Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఇషాన్‌ కిషన్‌కు గాయం

లండన్‌: భారత క్రికెట్‌ జట్టును మరోసారి గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ భారత్‌ జట్టులోని యువ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ ప్రాక్టీస్‌ చేస్తుండగా గాయపడ్డాడు. నెట్‌ ప్రాక్టీస్‌ భాగంగా నెట్‌ బౌలర్‌ అంకిత్‌ చౌదరీ వేసిన బంతి కిషన్‌ చేతికి బలంగా తాకింది. ఫలితంగా నొప్పితో విలావిల్లాడిన ఇషాన్‌ ఆ తర్వాతి ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. కాగా తుది జట్టులో వికెట్‌ కీపర్‌ స్థానం కోసం ఇషాన్‌ కిషన్‌, తెలుగు ఆటగాడు శ్రీకర్‌ భరత్‌ మధ్య భీకర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో భరత్‌కి తుదిజట్టులో స్థానం ఇవ్వాలని కొందరు మాజీలు అభిప్రాయపడుతుండగా, ఇషాన్‌కి అనుభవం ఉందని, అతన్నే వికెట్‌ కీపర్‌గా తీసుకోవాలని మరికొందరు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం అయిన గాయం కారణంగా తుది జట్టు ఎంపికకు ఇషాన్‌ అందుబాటులో ఉండకపోతే భరత్‌కి టీమ్‌లో స్థానం ఖారారైనట్లే. కాగా గాయం కారణంగా రిషభ్‌ పంత్‌, జస్ప్రీత్‌ బుమ్రా, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ వంటి కీలక ఆగగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం ఎంపికైన భారతజట్టు:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, ఛతేశ్వర్‌ పుజారా, విరాట్‌ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమేష్‌ యాదవ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img