Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సామ్‌కరన్‌పై సెహ్వాగ్‌ విమర్శలు

న్యూదిల్లీ: పంజాబ్‌ కింగ్స్‌ స్టాండిరగ్‌ కెప్టెన్‌ సామ్‌ కరన్‌ పై భారత జట్టు మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శలు గుప్పించాడు. రూ. 18.50 కోట్లు పెట్టి మ్యాచ్‌ విన్నర్‌ను కొనలేమని అన్నాడు. ‘సామ్‌ కరన్‌ అంతర్జాతీయ ఆటగాడు. కోట్లు పెట్టి కొనుగోలు చేసినంత మాత్రాన అతను మ్యాచ్‌లు గెలిపిస్తాడని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే.. అతడికి అనుభవం లేదు. క్రికెట్‌లో అనుభవం అనేది మ్యాచ్‌లు ఆడుతుంటేనే వస్తుంది’ అని ఈ మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ తెలిపాడు. కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ గాయపడడంతో సామ్‌ కరన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్న సామ్‌ కరన్‌ రెండో మ్యాచ్‌లో సత్తా చాటలేకపోయాడు. గత మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో పంజాబ్‌ అనూహ్యంగా ఓడిపోయింది. 175 లక్ష్య ఛేదనలో 150 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో సామ్‌ కరన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో విఫలమయ్యాడు. 12 బంతులు ఎదుర్కొన్న అతను 10 పరుగులకే రనౌటయ్యాడు. దాంతో, పంజాబ్‌ మూడో ఓటమితో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ చేరాలంటే కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ ఆడడం ఎంతో ముఖ్యం. ఫామ్‌లో ఉన్న అతను చెలరేగితే పంజాబ్‌ గెలుపు బాట పట్టడం ఖాయం. ఆ జట్టు ఏప్రిల్‌ 22న తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img