Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

అన్నికార్యక్రమాల్లో పార్వతీపురం నియోజక వర్గం బేష్

పార్టీ పరిశీలకులుశోభాహైమావతి

విశాలాంధ్ర, సీతానగరం: రాష్ట్ర ముఖ్యమంత్రి,,వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న, అమలు చేస్తున్న ప్రతీకార్యక్రమంను ముందుగా పార్వతీపురం నియోజక వర్గంలో ఎమ్మెల్యే జోగారావు నిర్వహిస్తూ ముందంజలో ఉంటున్నారని నియోజక వర్గ పరిశీలకులు, ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తెలిపారు. బూర్జలో అమె మాట్లాడుతూ మన నమ్మకమే కాకుండా మన భవిషత్ జగనన్న ఆని తెలిపారు. ఇక్కడ నాయకులంతా సమష్టి కృషిని కొనియాడారు.జగనన్న ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, కన్వీనర్ల వ్యవస్థ, గృహ సారదుల వ్యవస్థ,నవరత్నాలు ఇలా
ఏపథకం చూసిన ప్రపంచం గర్వించ దగ్గదన్నారు. తనకు పార్వతీపురం నియోజకవర్గం పరిశీలకులుగా నియమించిన పార్టీకీ ధన్యవాదాలు తెలిపారు. నియోజక వర్గంలో గృహ సారథుల 8విడతులగా పూర్తి
జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img