Friday, April 26, 2024
Friday, April 26, 2024

నోడల్ రిసోర్స్ సెంటరుగా శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాల

కో ఆర్డినేటర్ గా డాక్టర్ చింతల

విశాలాంధ్ర పార్వతీపురం/పార్వతీపురం టౌన్: రెండు జిల్లాలకు నోడల్ రిసోర్స్ సెంటరుగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోగల శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఎంపిక చేస్తూ రాష్ట్ర ఉన్నత విద్యశాఖా కమీషనర్ పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలోని
శ్రీవెంకటేశ్వర డిగ్రీ కళాశాలను ఈఏడాది ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా మార్చిన సంగతి తెలిసిందే.ఇటీవల రాష్ట్ర కమీషనర్, ఇతర అధికారులు కళాశాలను సందర్శించిన సమయంలో ఇక్కడ వనరులు, విద్యా ప్రమాణాలు, భౌగోళిక వాతావరణం, పచ్చని మైదానం, చుట్టూ ప్రహరీ, తరగతి గదులు, మౌళిక సదుపాయాలు, వసతులు చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రానికి మూలగా మన్యం జిల్లాలోని ఉన్న ఈకళాశాల పనితీరును కమీషనర్ మెచ్చుకొని ప్రశంసలు తెలిపారు. అటువంటి ఈ కళాశాలను నోడల్ రిసోర్స్ సెంటర్ గా ఎంపిక చేస్తూ విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపకులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమోడల్ రిసోర్స్ సెంటర్ పరిధిలోకి రెండు జిల్లాలకు చెందిన 12కళాశాలలను మ్యాపింగ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.పార్వతీపురం మన్యం జిల్లాలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వడిగ్రీ కళాశాలతోపాటు పాలకొండ, సాలూరు, వీరఘట్టం, సీతంపేట, గుమ్మలక్ష్మీపురంలోగల డిగ్రీకాలేజీలతోపాటు విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోట, చీపురుపల్లి రాజాం,విజయనగరం, గజపతినగరంలోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను, విజయనగరంలోని ఎం ఆర్ సంస్కృత ప్రభుత్వ డిగ్రీ కళాశాల  ఎన్ ఆర్ సి పరిధిలోకి వస్తాయన్నారు. 12కళాశాలలకు సంబందించి పలు శిక్షణలు, కారీర్ గైడెన్సు, కెపాసిటీ బిల్డింగ్ తదితర అంశాలపై శిక్షణ కార్యక్రమాలను ఈకలసకలో నిర్వహించడం జరుగుతుంది. నోడల్ రిసోర్స్ సెంటర్ గా పార్వతీపురం ఎస్ వి జి డి ని ఎంపిక, ఎన్ ఆర్ సి కోఆర్డినేటర్ గా ప్రిన్సిపల్ డాక్టర్ చలపతి రావుకు ఇవ్వడం పట్ల జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు,అధ్యాపకులు, తదితరులు అభినందించారు. తనకు బాధ్యతలు అప్పజెప్పడం ఎంతోఆనందంగాఉందని, విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలను తూచ తప్పక పాటించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ చలపతిరావు తెలిపారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img