Friday, April 26, 2024
Friday, April 26, 2024

కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధం

డీహెచ్‌ శ్రీనివాసరావు
కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు తెలిపారు. నిన్న ఒక్క రోజే అమెరికాలో 4లక్షలు, యూకేతో పాటు పలు దేశాల్లో లక్షకు పైగా కేసులు నమోదు అవుతున్నాయన్నారు. 130 దేశాకు కొత్త కోవిడ్‌ వేరియంట్‌ పాకిందని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో డీహెచ్‌ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో కోవిడ్‌ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వచ్చే రెండు నుంచి నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. డెల్టా వేరియంట్‌ కంటే 30 రేట్లు వేగంగా విస్తరిస్తోందనే మాటలు వినిపిస్తున్నాయని చెప్పారు. ‘థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయిందని అనుకోవచ్చు. ఒమిక్రాన్‌ వ్యాధి లక్షణాలు 90శాతం మందిలో కనిపించడం లేదు. లక్షణాలు లేని వ్యక్తిని టెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. కొత్త వేరియంట్‌ ముప్పు నుంచి వ్యాక్సిన్‌ వేసుకుంటే తప్పించుకోవచ్చు. వచ్చే సంక్రాంతి థర్డ్‌ వేవ్‌కు ప్రారంభం. ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది.’అని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని, సంక్రాంతి తర్వాత థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశముందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img