Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా? : మంత్రి గంగుల

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల పై అవమానకరంగా వ్యవహరిస్తోందని మంత్రి గంగుల కమలాకర్‌ మండిపడ్డారు. ధాన్యం సేకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అవమాన పూరిత, నిర్లక్ష్య వైఖరిపై రాష్ట్ర మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌ కలిసి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి గంగుల కమాలాకర్‌ మాట్లాడుతూ, ధాన్యం సేకరణ అంశాలపై కేంద్ర మంత్రిని ఐదుసార్లు రాష్ట్ర మంత్రుల బృందమే కలిసిందని, ప్రతిసారీ అవహేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడారని దుయ్యబట్టారు. అయినా తెలంగాణ రైతాంగం కోసం వాటన్నింటిని భరించి మొన్నటి రోజున కలిశామని ఈసారి వారి తీరు పరాకాష్టకు చేరుకుందని అన్నారు. తెలంగాణ ధాన్యాన్ని సేకరించాలేమని చెబుతూ, తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించే అలవాటు చేయాలని మాట్లాడారన్నారు. ఈ మాటల్ని ఖండిరచాల్సిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణ బిడ్డ కాదా? అని ప్రశ్నించారు.తెలంగాణ ప్రజలకు, రైతులకు అన్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వానికి వంత పాడడం అనైతికమని మండిపడ్డారు. నిజాల్ని వక్రీకరించేలా కేంద్ర మంత్రి హోదాలో అబద్దాలు చెప్పడం హేయమన్నారు. ఒప్పందం చేసిన పరిస్థితులపై కొట్లాడాల్సిన బాధ్యత కిషన్‌ రెడ్డికి లేదా? అని నిలదీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img