Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో అగ్నిప్రమాదం

నగరంలోని కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కేపీహెచ్‌బీ కాలనీలోని శివపార్వతి థియేటర్‌లో ఆదివారం అర్ధరాత్రి దాటాక మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. దీంతో థియేటర్‌లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. మంటల ధాటికి థియేటర్‌ పైకప్పు కూలిపోయింది. అయితే ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్ట తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు అగ్నిమాపక యాంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. మూడుగంటలపాటు శ్రమించి మంటలు ఆర్పేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img