Friday, April 26, 2024
Friday, April 26, 2024

చేనేత కార్మికులకు చెక్కుల పంపిణీ


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు భరోసా దొరికిందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాల్‌లో చేనేత కార్మికులకు మంగళవారం ఏర్పాటు చేసిన చెక్కులు పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డితో కలిసి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేవని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి భరోసా దొరికిందని అన్నారు. దాదాపు 2 వేల మంది లబ్ధిదారులకు రూ. కోటి 69 లక్షల 1,803 చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడిరచారు. చేనేత కార్మికులకు 50 ఏండ్లకే పెన్షన్‌ ఇస్తున్నామని, ముడి సరుకుకు సబ్సిడీ అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img