Friday, April 26, 2024
Friday, April 26, 2024

టీిఆర్‌ఎస్‌ పాలనలో అభివృద్ధి శూన్యం

కూనంనేని సాంబశివరావు

విశాలాంధ్ర, హైదరాబాద్‌ : దేశంలోని ఇతర రాష్ట్రా రాజధానులను పోలిస్తే, టీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ నగరం అభివృద్ధి శూన్యమని, క్షీణించిన వాతావరణాన్ని కలగజేస్తుందని సీపీిఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌, హిమాయత్‌ నగర్‌ సత్యనారాయణ రెడ్డి భవన్‌లో సీపీిఐ హైదరాబాద్‌ జిల్లా సమితి సమావేశం షంషుద్దీన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైదరాబాద్‌ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలు తీసుకొని వేగవంతమైన అభివృద్ధి ఏమి చేయలేదని విమర్శించారు. కొద్దిపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయం, ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. నగరంలో మౌలిక సౌకర్యాలే కాక అనేక ప్రజా సమస్యలు ప్రజలను పట్టి పీడుస్తున్నాయని వీటిపై దృష్టి పెట్టాలని అలాగే ముఖ్యంగా మురికివాడల్లో పాదయాత్రలు నిర్వహించి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరానికి కృషి చేయాలన్నారు. చాలామంది నిరుపేదలు గుడిసెల్లోనే నివసిస్తున్నారని వారికోసం మిగిలిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు పూర్తి కావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని అయన కోరారు. గత జిహెచ్‌ఏంసి ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతకాక టీిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వాటిని తుంగలోతొక్కుతుందని, హైదరాబాద్‌ నగర ప్రజలకు ప్రాథమిక మౌలిక సదుపాయాలు, మెరుగైన జీవన ప్రమాణలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌ నగరం బహుళ మత, భాష, సంస్కృతుల ప్రజల మధ్య ఐక్యతను విచ్చిన్నం చేసి మతపర విభజనను రెచ్చగొట్టే ఆర్‌ఎస్‌ఎస్‌- బీజేపీలు చేసే ప్రయత్నాలకు గట్టిగా తిప్పికొట్టాలని పార్టీ నాయకత్వానికి ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నగరంలో ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాటలు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోవాలని కూనంనేని సాంబశివరావు కోరారు. సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈ.టి. నరసింహ మాట్లాడుతూ నగరంలో సీపీఐ పూర్వ వైభవానికి కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిలా కృషి చేయాలని, పార్టీ నిర్మాణ అభివృద్ధికి ప్రతీ కార్యకర్త కంకణబద్ధులై పార్టీ నాయకులు సమన్వంతో పని చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమితి సభ్యులు ప్రేమ్‌ పావని, నగర సమితి సభ్యులు ఎస్‌.ఏ. మన్నన్‌ తదితరు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img