Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

త్వరలో పీహెచ్‌సీలల్లో పూర్తిస్థాయి వైద్యులు : మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అధునాతన వైద్య సదుపాయాలు మెరుగుపడ్డాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.కాగజ్‌ నగర్‌ లో రూ. 5 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాల, నిర్మల్‌, ఆసిఫాబాద్‌లలో మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు మాత్రమే డయాలసిస్‌ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం తెలంగాణలో 102 డయాలసిస్‌ కేంద్రాలను నెలకొల్పామని స్పష్టం చేశారు. కాగజ్‌నగర్‌లో కూడా త్వరలో డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచేందుకు, మాత శిశువుల్లో రక్తహీనత తగ్గించేందుకు ప్రత్యేకంగా కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లను ఇస్తున్నామని అన్నారు. తెలంగాణలో అమలు జరుగుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతు అమలు చేస్తోందని అన్నారు. త్వరలో 950 డాక్టర్‌ పోస్టులను భర్తీ చేస్తున్నామని వెల్లడిరచారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు కోవలక్ష్మి , ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు ,కోనేరు కోనప్ప, జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, అదనపు కలెక్టర్‌ చాహత్‌ వాజ్‌పాయ్‌, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img