Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిమజ్జనంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్‌ కొట్టివేత

గణేష్‌ నిమజ్జనంపై జీహెచ్‌ఎంసీ వేసిన రివ్యూ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు అత్యవసర విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్ని యధావిథిగా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.గణేశ్‌ నిమజ్జనంపై ప్రభుత్వం ఇవాళ వేసిన రివ్యూ పిటీషన్‌ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. హుస్సేన్‌ సాగర్‌లో గణేషుడి విగ్రహాలు నిమజ్జనం చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌ ఈ ఉదయం హైకోర్టులో రివ్యూ పిటీషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తీర్పును పునఃపరిశీలించాలని అభ్యర్థించారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలను తొలగించాలని కోరారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. అయితే
దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పరిస్థితులన్నీ ప్రభుత్వమే సృష్టించుకున్నవేనని, సమస్యను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులది..కోర్టులది కాదని స్పష్టంచేసింది. హుస్సేన్‌సాగర్‌ని కాలుష్యం చేయమని చెప్పలేమని తేల్చిచెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img