Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోలీస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష: ఒక్క నిముషం ఆలస్యమైనా నో ఎంట్రీ..!

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి ఈనెల 7వ తేదీన నిర్వహించనున్న ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నాడు నిర్వహించనున్న పోలీస్‌ ప్రిలిమ్స్‌ పరీక్షకు మొత్తం 538 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌ నగరం చుట్టుపక్కల ప్రాంతాలలో 503 పరీక్షా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి, పరీక్షకు సన్నాహకాలు చేసింది. 554 ఎస్‌ఐ పోస్టులకు 2,47,217 మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
ఈ నెల 7వ తేదిన నిర్వహింబడే పోలీస్‌ రిక్రూట్‌ మెంట్‌ ఎస్‌.ఐ ప్రాథమిక పరీక్షకు సంబంధించి పరీక్షకు హజరవుతున్న అభ్యర్థులకు పలుసూచనలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు. పరీక్ష ఉదయం 10:00 నుండి మద్యాహ్నం 1:00 గంల వరకు నిర్వహించబడుతుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 9:00 గంల వరకే చేరుకోవాలి. ఉదయం 10:00 గంల తర్వాత పరీక్షా కేంద్రం గేట్లు మూసి వేయబడుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించరు.
పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్‌ ఫోన్లు, స్మార్ట్‌ ఫోన్లు, వాచ్‌లు, క్యాలిక్యులేటర్‌ తదితర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించరు. అభ్యర్థులు తమ వెంట పరీక్ష హాల్‌ టికెట్‌, పెన్‌ మాత్రమే తీసుకురావాలి. కోవిడ్‌ నిబంధనల మేరకు విద్యార్థులు మాస్క్‌ ధరించాలి. కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img