Friday, April 26, 2024
Friday, April 26, 2024

బిఆర్ఎస్ పార్టీ కార్యాల‌యం ప్రారంభం

దేశ రాజధానిలో సొంత భవనం కలిగిన అతి కొద్ది రాజకీయ పార్టీల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) చేరుతోంది. నేటి మధ్యాహ్నం గం. 1.05కు ఆ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్న పార్టీ కార్యాలయ భవనంలో సుదర్శన హోమం, వాస్తు పూజ, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులు పూర్తి చేసుకున్నప్పటికీ తుది మెరుగులు దిద్దే పనులు ఇంకా కొన్ని పెండింగులోనే ఉన్నాయి. కానీ ముందుగా అనుకున్న ముహూర్తం ప్రకారమే భవనాన్ని ప్రారంభించాలని కేసీఆర్‌ నిర్ణయించినట్టు- తెలిసింది. ఈ క్రమంలో పెద్దగా హంగు, ఆర్భాటాలు లేకుండా కేవలం పార్టీకి చెందిన ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇతర ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు ఉత్సాహంతో తమంతట తాముగా ఢిల్లీ బాట పట్టారు. గత రెండ్రోజుల నుంచి ఢిల్లీలోనే మకాం వేసిన మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తుండగా బుధవారం సాయంత్రం వరకు పలువురు ఎంపీలు, ఇతర నేతలు చేరుకున్నారు. పార్టీ పేరు టీ-ఆర్‌ఎస్‌గా ఉన్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో స్థలాన్ని కేటాయించింది. భారతీయ జనతా పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ సహా పలు ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలకు స్థలాలున్న దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ మార్గ్‌లోనే స్థలాన్ని సూచించినప్పటికీ వాస్తు, స్థలం విస్తీర్ణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వసంత్‌ విహార్‌ స్థలాన్నే ఖరారు చేశారు. భూమి పూజ సమయానికి టీ-ఆర్‌ఎస్‌ పేరుతో ఉన్న పార్టీ, ప్రారంభోత్సవ సమయానికి బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుంది. నాడు ఒక ప్రాంతీయ పార్టీగా ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉండాలని కోరు కున్న ఆ పార్టీ అధినేత కేసీఆర్‌, పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు. పార్టీ పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కూడా అనుమతులు లభించాయి. సరిగ్గా ఈ సమయంలో పార్టీ కార్యాలయ భవనం నిర్మాణం పూర్తిచేసుకోవడంతో ఈ భవనమే పార్టీ జాతీయ ప్రధాన కార్యాలయంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img