Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యుత్‌ చట్టాలను కూడా మోడీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలి

మంత్రి నిరంజన్‌ రెడ్డి
ప్రధాని మోదీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముందే ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ఎందరో రైతుల ప్రాణాలు దక్కేవని- కేంద్రం పరువు దక్కేదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం నిర్ణయంతో రైతులు ఎదురుచూస్తున్న ఫలితం వచ్చిందని, ఈ పోరాటంలో అమరులైన రైతుల కుటుంబాల బాధ్యతలను కేంద్రమే తీసుకోవాలని కోరారు. రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వం పలుచన అవుతోందని ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.టిఆర్‌ఎస్‌ మహాధర్నా సంకేతాలు మోడీ ప్రభుత్వం గ్రహించారని తెలిపారు. రైతులకు క్షమాపణ చెప్పడం మోడీ గొప్ప మనసును ఒప్పుకుంటున్నామన్నారు. ఇది ప్రజల విజయమని మంత్రి చెప్పుకొచ్చారు.కేంద్రం ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకుందని మేం అనుకోవడం లేదు. రైతు చట్టాల వల్ల బీజేపీ ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందనే ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు. అయితే సాగు చట్టాలు ఉపసంహరించుకున్నంత మాత్రాన కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు. రైతులకు పూర్తి స్థాయి న్యాయం జరిగే వరకు కేసీఆర్‌ ఉద్యమం చేస్తూనే ఉంటారని అన్నారు. రైతు చట్టాల మాదిరిగానే విద్యుత్‌ చట్టాలను కూడా మోడీ ప్రభుత్వం పూర్తిగా వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img