Friday, April 26, 2024
Friday, April 26, 2024

సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రూ. 50 కోట్లు

మంత్రి కేటీఆర్‌
రాబోయే వారం పది రోజుల్లో సంగారెడ్డి, సదాశివపేట మున్సిపాలిటీలకు రూ. 50 కోట్లు విడుదల చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌-నాన్‌ వెజ్‌ మార్కెట్‌కు కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏడు వైకుంఠ రథాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, మున్సిపల్‌ కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి గతంలో ఉండేది. కేసీఆర్‌ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పట్టణ, పల్లెప్రగతి కార్యక్రమం కింద నిధులు విడుదల చేసి సఫాయి కార్మికులకు నెల నెల జీతాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. పట్టణ ప్రగతి కింద సంగారెడ్డి పట్టణానికి ప్రతి నెలలో రూ. 15 కోట్ల 30 లక్షలు, సదాశివపేటకు రూ. 7 కోట్ల 95 లక్షలు, జహీరాబాద్‌కు రూ. 16 కోట్ల 9 లక్షల నిధులు చెల్లిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీలకు ఇప్పటి వరకు రూ. 66 కోట్ల 12 లక్షలు విడుదల చేశామన్నారు. సంగారెడ్డి పట్టణంలో ఇవాళ ఇంటిగ్రేటెడ్‌ వెజ్‌, నాన్‌ వెజ్‌ మార్కెట్‌కు రెండు ఎకరాల స్థలంలో శంకుస్థాపన చేశామని తెలిపారు. దీన్ని రూ. 6 కోట్ల 72 లక్షల వ్యయంతో నిర్మించనున్నారు. 142 మున్సిపాలిటీల్లో రూ. 500 కోట్లతో ఆధునీకమైన వెజ్‌ నాన్‌ వెజ్‌ మార్కెట్లు నిర్మిస్తున్నాం. గౌరవంగా అంతిమ సంస్కారాలు జరగాలనే ఉద్దేశంతో వైకుంఠధామాలను నిర్మిస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img