Friday, April 26, 2024
Friday, April 26, 2024

సంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయటకు రావాలి

మంత్రి నిరంజన్‌ రెడ్డి

సంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయటకు రావాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ఏ రకమైన పంటలు పండిస్తే మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందో వాటినే పండిరచాలని సూచించారు. వనపర్తి నియోజకవర్గంలో 41 రైతు వేదికలలో ఏకకాలంలో రైతుల ఆత్మీయ సమ్మేళనాల నేపథ్యంలో గోపాల్‌ పేట, పొలికెపాడు తదితర రైతు వేదికలలో సమ్మేళనాలకు మంత్రి నిరంజన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు రాజ్యంగా, రైతు రాష్ట్రంగా తెలంగాణ నిలవాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు. .రైతుల పరిస్థితి 2014 తెలంగాణకు ముందు, 2014 తెలంగాణ తర్వాత బేరీజు వేసుకోవాలన్నారు.వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత దేశంలో ఎవరూ ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, సాగునీరు, రైతుబంధు కింద పంట పెట్టుబడి, రైతు బీమా పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలుకావడం లేదన్నారు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతులు బయటకు రావాలన్నారు. ఏ రకమైన పంటలు పండిస్తే మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందో వాటినే పండిరచాలని సూచించారు. ఆహార ధాన్యాల పంటలతో పాటు ఉద్యాన పంటల మీద ఇకపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పండ్ల తోటలు, ఆయిల్‌ పామ్‌, నూనె గింజల సాగు మీద దృష్టిపెట్టాలి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి, ఆదాయం వచ్చేలా చూసుకోవాలన్నారు.మార్కెటింగ్‌ నెట్‌ వర్క్‌ ను వ్యవసాయరంగానికి అనుసంధానం చేసేలా చర్యలు చేపడుతాం. 41 రైతు వేదికలలో రైతు ఆత్మీయ సమ్మేళనాల ద్వారా వచ్చిన సూచనలు, సలహాలు తీసుకుని ముందుకుసాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img