Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు : జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది. నగరంలో చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని నుంచి తేరుకోకముందే నగరంలో ఇవాళ మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అధికారులు సూచించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర, వాయవ్య దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img