Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కరోనా, ఒమిక్రాన్‌ పరిస్థితులపై హైకోర్టులో విచారణ

కరోనా, ఒమిక్రాన్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది.ఒమిక్రాన్‌ వైరస్‌ తీవ్ర స్థాయిలో ఉన్నందున నిర్ధారణ పరీక్షలు పెంచాలని ప్రభుత్వానికి ఆదేశించింది.ఒమిక్రాన్‌ వైరస్‌ చిన్న పిల్లలలో కూడా చాలా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని తెలిపింది. కావున ఇప్పుడున్న నీలోఫర్‌ ఆసుపత్రి కాకుండా అదనంగా కొన్ని ఆసుపత్రులను పెంచాలంటూ ప్రభుత్వానికి సూచించింది.1-12-2021, 28-1-2021 తేదీల్లో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని సూచించింది. సినిమా హాల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, ఇతర కమర్షియల్‌ ఎస్టాబ్లిస్‌మెంట్‌ కోసం కరోనా నియమనిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది. వారాంతం జరిగే సంతలలో కూడా కోవిడ్‌ నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img