Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం

: మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారంతో తెలంగాణ రైతన్నలు సంతోషంగా వున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జన్మదినోత్సవాల సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి వ్యవసాయంలో తెలంగాణ సాధించిన విజయాలపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా వుందని అన్నారు. గడచిన ఏడేళ్లలో తెలంగాణలో ప్రాథమిక రంగం (వ్యవసాయం) సగటు వృద్ది రేటు 15.8 శాతంగా నమోదయిందని అన్నారు. ఇది జాతీయ వృద్ది రేటు 8.5 శాతం కన్నా చాలా ఎక్కువని మంత్రి పేర్కొన్నారు. దేశంలో 60 లక్షల ఎకరాలలో పత్తి ఉత్పత్తి చేస్తూ నంబర్‌ వన్‌ స్థానంలో తెలంగాణ నిలించిందన్నారు.అలాగే ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నంబర్‌ 2స్ధానం, సేకరణలోనూ నెంబర్‌2గా నిలిచిందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img