Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఘనంగా నిట్‌ యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం

హైదరాబాద్‌ : లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ నిట్‌ యూనివర్శిటీ (ఎన్‌యు) తమ 11వ స్నాతకోత్సవ వేడుకలను వర్ట్యువల్‌గా నిర్వహించింది. ఈ వర్ట్యువల్‌ స్నాతకోత్సవ వేడుకలో గ్రాడ్యుయేటింగ్‌ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు, పారిశ్రామిక నాయకులు, అతిథులు, ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో ప్రతి గ్రాడ్యుయేట్‌ తమ సర్టిఫికెట్‌ను నిట్‌ యూనివర్శిటీ అధ్యక్షులు ప్రొఫెసర్‌రాజేశ్‌ ఖన్నా, ముఖ్యఅతిథి డాక్టర్‌ అరుణభా ఘోష్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌- సీఈఈడబ్ల్యు నుంచి అందుకున్నారు. విద్యార్థులంతా భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు ఎన్‌యు ఫౌండర్‌ మరియు నిట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ రాజేంద్ర ఎస్‌ పవార్‌ ఆకాంక్షించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img