Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

విద్యుత్ స్తంభం ఏర్పాటు కోసం తీసిన గోతిలో విగత జీవిగా ఎద్దు

జియో ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఎద్దు మృతికి కారణం

బాధితురాలు సన్యాసమ్మ ఆరోపణ

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఇటీవల కాలంలో మారుమూల గిరి గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సెల్ సంకేతాలు అందక లబ్ధిదారులు, అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మారుమూల గిరి గ్రామాలకు బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థలు ముందుకు వచ్చి టవర్ల నిర్మాణానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగానే జియో టవర్ నిర్మాణం పూర్తయినప్పటికీ సంకేతాలు అందించేందుకు విద్యుత్తు లైన్ అవసరం కావడంతో జియో ఉన్నత అధికారులు టవర్ సమీపంలోనే విద్యుత్ స్తంభం ఏర్పాటుకు పెద్ద గుంత తవ్వి వదిలేయడంతో అర్ధరాత్రి సమయంలో ఆ గుంతలో పడి ఎద్దు మృతి చెందిందని బాధితురాలు బుట్టారి సన్యాసమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. వారం రోజుల క్రితమే తన భర్త ప్రకాష్ రావు మృతి చెందాడని, భర్త మృతి మరువక ముందే తమ కుటుంబానికి ఇటువంటి విషాద ఘటన జరగడం బాధాకరమని, జియో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వ్యవసాయపరంగా తమకు ఆధారమైన ఎద్దు మృతి చెందిందని, జియో ఉన్నతాధికారులే తనకు నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేస్తుంది. మృతి చెందిన ఎద్దును గ్రామ పొలిమేరలోనే ఖననం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img