Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం… 5 లీటర్ల నాటు సారా స్వాధీనం

జిల్లా ఎస్పీ ఆదేశాలతో నాటు సారా తయారీ స్థావరంపై బెళుగుప్ప పోలీసుల దాడులు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆదేశాలతో బెళుగుప్ప పోలీసులు నాటు సారా తయారీ స్థావరంపై దాడులు నిర్వహించారు. బెళుగుప్ప గ్రామ శివార్లలోని కంపచెట్ల మధ్యన ఏర్పాటు చేసుకున్న నాటు సారా స్థావరంపై ఎస్సై శివ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేసి 300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. 5 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img