Friday, April 26, 2024
Friday, April 26, 2024

దళిత డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి….

దళిత డప్పు కళాకారుల సంఘం డిమాండ్…

విశాలాంధ్ర- పెనుమంట్ర: రాష్ట్రంలో ఉన్న దళిత డప్పు కళాకారులకు సాంస్కృతి శాఖ ద్వారా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కళింగ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. దళిత డప్పు కళాకారుల సంఘం పశ్చిమగోదావరి జిల్లా సమావేశం మార్టేరు హై స్కూల్ గ్రౌండ్ నందు సంఘం ఉపాధ్యక్షుడు దిద్దే ప్లెడర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న లక్ష్మణరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు కావస్తున్నా డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గత ప్రభుత్వం దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా డప్పు కళాకారుల పెన్షన్ ఇచ్చారు . ఈ ప్రభుత్వం గుర్తింపు కార్డులు,పెన్షన్ ఇవ్వడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. కొత్తవారికి వివిధ రూపాలలో కొర్రీలు పెట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసింది శూన్యం అన్నారు. దళితులకు సంబంధించి అనేక పథకాలు ఉన్నాయని, ఆ పథకాల ద్వారా డప్పు కళాకారులు ఆదుకోవచ్చ న్నారు. జగనన్న వచ్చిన తర్వాత ఎస్ సి పథకాలకు, చట్టాలకు సమాధి చేశారని విమర్శించారు. ప్రభుత్వం దళితుల పట్ల, దళిత డప్పు కళాకారుల పట్ల వివక్ష చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డప్పు కళాకారుల పట్ల ఇదేవిధంగా మొండి వైఖరి అవలంబిస్తే రానున్న రోజుల్లో దళిత సామాజిక వర్గం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు లాల్సన్, కార్యదర్శి దిద్దే నాగేశ్వరరావు, పెనుమాక అబూ సలీం. సెట్టిమీ నాగేశ్వరరావు, సిర్ర పెద్దిరాజు, పల్లెటి రాముడు, కంకిపాడు కృష్ణారావు, ముప్పిడి నాగేశ్వరరావు, సొంగ రామారావు, బత్తిన వీర్రాజు, తదితర జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img