Friday, April 26, 2024
Friday, April 26, 2024

రవిబాబు అరెస్ట్‌ ఆప్రజాస్వామికం…


ఎమ్మెల్యే మంతెన రామరాజు
విశాలాంధ్ర`ఉండి :
నరసాపురం పార్లమెంట్‌ తెలుగు యువత కార్యనిర్వాహణ కార్యదర్శి బురిడి రవిబాబు అక్రమ అరెస్ట్‌ ఆప్రజాస్వామికమని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మండిపడ్డారు. భీమవరంలోని సబ్‌ జైల్లో ఉన్న రవిబాబును ఎమ్మెల్యే మంతెన రామరాజు, టిడిపి నాయకులు అనంతరం హుండీలో జరిగిన విలేకరుల సమావేశంలో రామరాజు మాట్లాడుతూ, టిడిపిలో క్రియాశీలకంగా పనిచేస్తున్న రవిబాబుపై అధికార పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అధికార అహంభావంతో, పోలీసుల సహాయంతో అక్రమ కేసులు బనాయించి జైల్లో వేయించారని ఆరోపించారు. మండలంలోని అర్తమూరు గ్రామంలో జరిగిన ఒక గొడవలో ఎటువంటి సంబంధం లేని రవిబాబును కావాలనే ఇరికించి అక్రమ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇంటికి వెళ్లి సెల్‌ ఫోన్‌ లాక్కుని మహిళలు అని చూడకుండా దూషించి, తోసివేసి నేరస్తుడులా అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఏ పార్టీకి అధికారం శాశ్వతం కాదని పోలీసులు గ్రహించాలన్నారు. ఆ గొడవకు సంబంధం లేని వ్యక్తిని మొదటి ముద్దాయిగా చేర్చడం పోలీసుల అత్యుత్సాహానికి నిదర్శనమన్నారు. విద్యావంతుడు సీనియర్‌ జర్నలిస్ట్‌ అయిన రవి బాబు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తిచూపుతూ ప్రజలకు తెలియజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని వాటిని జీర్ణించుకోలేని అధికారపక్ష నాయకులు రవిబాబుపై కుట్రపూరితంగా జైలుకు పంపించాలన్న దురుద్దేశంతో సెక్షన్‌ 324, 120 వేసి రిమాండ్‌ కు పంపించడం దుర్మార్గమన్నారు. రవిబాబును జైలుకు పంపించాలన్న దురుద్దేశంతో స్టేషన్‌ బెయిలు పై వచ్చే మిగతా ఐదుగురు దళిత సోదరులను కూడా జైలుకు పంపించడంలో పోలీసులు వెనుకడుగు వేయలేదంటే దాని వెనక ఎంత కుట్ర దాగుందో స్పష్టంగా అర్థం అవుతుందని తెలిపారు.
ఈ అక్రమ అరెస్ట్‌ పై ప్రైవేట్‌ కేసు వేసి టిడిపి తరపున న్యాయ పోరాటం చేస్తామన్నారు.ఈ సమావేశంలో టిడిపి మండల అధ్యక్షులు జుత్తిగ శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు కాగిత మహంకాళి, దుంపగడప శ్రీనివాసరావు, కట్టా రాంబాబు, మంతెన సాయి లచ్చిరాజు, చెన్నం శెట్టి హరి నాయుడు, దూసనపూడి రాంబాబు, కిన్నిర వెంకన్న, గురుగుబెల్లి సత్యనారాయణ, కాగిత బుజ్జి, ఉంగరాల నాగేశ్వరరావు, గంధం బుజ్జి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img