Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ప్రకాశం డిగ్రీ కళాశాలకు ఐఎస్ఓ గుర్తింపు…

విశాలాంధ్ర -కొయ్యలగూడెం: కొయ్యలగూడెం పట్టణానికి చెందిన ప్రకాశం డిగ్రీ కళాశాల ఐఎస్ఓ గుర్తింపు పొందినట్లు కళాశాల కరస్పాండెంట్ వి.జనార్ధన రావు గురువారం తెలిపారు. సొంత కళాశాల భవనం, నాణ్యమైన విద్య, అర్హత, అనుభవం కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన, తమ కళాశాల నుంచి అత్యధికంగా ఉద్యోగాలు పొందడం తదితర విషయాలను పరిగణనలోనికి తీసుకుని ఐఎస్ఓ 9001:2015 ధ్రువపత్రం జారీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ వి. జనార్ధన రావు మాట్లాడుతూ ఐ ఎస్ ఓ గుర్తింపు పొందడంతో తమ కళాశాలపై మరింత గురుతర బాధ్యత పెరిగిందన్నారు. విద్యార్థులను నైపుణ్యంతో కూడిన విద్య బోధన చేసి అంతర్జాతీయంగా మంచి పేరు తీసుకువచ్చే విధంగా తమ కళాశాలను తీర్చిదిద్దుతామని తెలిపారు. కళాశాల అభివృద్ధికి సహకరిస్తున్న యాజమాన్యానికి, అధ్యాపకులకు, కొయ్యలగూడెం పట్టణ ప్రజలకు, యూనివర్సిటీ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img