Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు దృష్టి సారించాలి…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు ముందుండాలని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం కొయ్యలగూడెం పట్టణంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం కోసం ముఖ్యమంత్రి జగన్‌ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కార దిశలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంజిమల రామారావు, జడ్పిటిసి దాసరి శ్రీలక్ష్మి, వైస్‌ ఎంపీపీ తుమ్మలపల్లి గంగరాజు, మాజీ ఎంపీపీ మట్టా సత్యనారాయణ( సత్తిపండు) పట్టణ అధ్యక్షుడు సంకు కొండలరావు, ముప్పిడి చిన్నబాబు, రసపుత్ర బాపూజీ, తహసిల్దార్‌ పి. నాగమణి, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్‌, ఎస్‌ ఐ విష్ణువర్ధన్‌, అగ్రికల్చర్‌ ఏవో చెన్నకేశవులు, ఎంఈఓ సురేష్‌ బాబు, హౌసింగ్‌ ఏఈ సతీష్‌, పరింపూడి పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, ఏపీఎం సుబ్రహ్మణ్యం, ఏపీవో నాగేశ్వరరావు, సచివాలయ ఉద్యోగులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img