Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

రాజ్‌భవన్‌లో గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిజీ జయంతి వేడుకలు

అహింసను మించిన ఆయుధం లేదని ప్రపంచానికి చాటి చెప్పిన మహాత్ముని జీవితం ఆచరణీయమని ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. మహత్మా గాంధీజీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రిజీ జయంతి వేడుకలను పురస్కరించుకొని రాజ్‌భవన్‌లో నేతల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం రాజ్‌భవన్‌ ఆవరణలో గవర్నర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం భారతీయులే కాక ప్రపంచవ్యాప్తంగా జాతి పిత మహాత్మా గాంధీ 152వ జయంతి, భారతదేశ ద్వితీయ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి 117వ జయంతిని జరుపుకుంటున్నారన్నారని తెలిపారు. గాంధీ జయంతిని ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకోవటం భారతీయులుగా మనకు గర్వకారణమన్నారు.లాల్‌ బహదూర్‌ శాస్త్రి బలమైన నాయకునిగా దేశ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పటికీ వినయంతో, మృదువుగా మాట్లాడేవారని గవర్నర్‌ అన్నారు. గాంధీజీ జయంతి వేడుకలలో భాగంగా గవర్నర్‌.. ఆంధ్రప్రదేశ్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ నేతృత్వంలో పది లక్షల మొక్కల పెంపకానికి శ్రీకారంచుట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img