Monday, May 6, 2024
Monday, May 6, 2024

మోదీ సర్కార్‌ మెడలు వంచుతాం

విశాలాంధ్ర, హైదరాబాద్‌ : పెట్రోల్‌ డిజిల్‌ ధరనలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న మోదీ సర్కార్‌ మెడలు వంచుతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. బుధవారం ఇందిరా పార్కు వద్ద చలో రాజ్‌ భవన్‌ ప్రదర్శన్‌లో పోలీస్‌లు వామపక్ష నాయకులును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను పెంచుతోందని విమర్శించారు. దీంతో సామాన్య మధ్య తరగతి ప్రజలపై పెనుభారం పడుతోందన్నారు. నిత్యావసర వస్తువుల ధరు ఆకాశనంటున్నాయన్నారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించి ప్రజలకు తక్షణమే ఉపశమనం కల్పిం చాల’’ని డిమాండ్‌ చేశారు. సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ..మోదీ ప్రభుత్వం నిర్భంధ చట్టాలను ప్రయోగిస్తోందన్నారు. అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ మంటట్లో మోదీ ప్రభుత్వం కాలిపోతుందని, భవిష్యత్‌ మోదీ ప్రభు త్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్షపార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీస్‌లు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌లకు తరలించారు.
పోలీస్‌ స్టేషన్‌లో చాడ జన్మదిన వేడుకలు
బుధవారం హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద వామపక్షాల ‘‘చలో రాజ్‌భవన్‌’’ ప్రదర్శనలో పాల్గొని అరెస్ట్‌ అయిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తన 72 వ పుట్టినరోజు వేడుకలను గాంధీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీపీఐ వామపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య కేక్‌ కట్‌ చేసి ఘనంగా జరుపుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిజి. నరసింహ రావు, సీపీఐ హైదరాబాద్‌ జిల్లా కార్యదర్శి ఈటీ నరసింహ, సీపీఐ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, సీపీఐ మేడ్చల్‌ – మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి డిజి సాయిలు గౌడ్‌, సీపీఐ నేతలు ఒరుఘంటి యాదయ్య, ప్రభులింగం, వెంకట్‌ రెడ్డి, బి. స్టాలిన్‌ తతరులు చాడ వెంకట్‌ రెడ్డి కి పుష్పగుచ్చాలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img