Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఏన్నో ఏళ్ళ క్రితంనాటి చిహ్నాలను తొలగించమనడం మంచి పద్దతి కాదు

జిన్నా టవర్‌పై హోంమంత్రి సుచరిత స్పందన
రాష్ట్రంలో వివాదాస్పందగా మారిన జిన్నా టవర్‌పై హోంమంత్రి సుచరిత మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం మనదని..ఏ ఉద్దేశంతోనైనా ఉన్న కట్టడాలు తొలగించాలనడం సరికాదని తెలిపారు. శాంతి భద్రతల సమస్య వస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జిన్నా టవర్‌ వలన జిన్నా ఏం నష్టం చేశాడు, ఏం మేలు చేశాడు అనేది ప్రజలు తెలుసుకుంటారని చెప్పారు. మతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం తప్పన్నారు. ఎవరు అధికారంలో ఉన్న ఏన్నో ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన చిహ్నాలను తొలగించాలనడం మంచి పద్దతి కాదన్నారు. అబ్దుల్‌ కలాం పేరుతో కొత్త నిర్మాణాలు చేయండి ఉన్నవి తొలగించవద్దని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img