Monday, May 6, 2024
Monday, May 6, 2024

వనమా రాఘవను వెంటనే అరెస్టు చేయాలి : ఎంపీ కోమటిరెడ్డి

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్‌ను వెంటనే అరెస్టు చేయాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఒక ఎమ్మెల్యే కుమారుడు ఇంతటి దారుణానికి పాల్పడితే చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. సభ్య సమాజం తలదించుకునే ఈ ఘటనలో నిందితుడైన వనమా రాఘవను ఈ సాయంత్రంలోపు అరెస్ట్‌ చేసి చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి మనవడిని ఒక మాట అంటే గగ్గోలు పెట్టిన..సీఎంకు ఈ ఘటన కనపడడం లేదా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img