Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పీఎస్‌ఎల్వీ సి-52 ప్రయోగం విజయవంతం..శాస్త్రవేత్తలకు సీఎం జగన్‌ అభినందనలు

పీఎస్‌ఎల్వీ సి-52 ప్రయోగం విజయవంతం కావడంపై ఏపీ సీఎం జగన్‌ స్పందించారు. పీఎస్‌ఎల్వీ శ్రేణిలో చేపట్టిన తాజా ప్రయోగం సఫలం కావడం పట్ల ఆయన ఇస్రో శాస్త్రజ్ఞులను అభినందించారు. అగ్రదేశాలకు దీటుగా భారత్‌ను నిలపడంలో ఇస్రో కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో భారతదేశ అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను ఇస్రో మరింత ఇనుమడిరపజేసిందని కొనియాడారు. ఇస్రో భవిష్యత్తులో ప్రతి ప్రయోగంలోనూ విజయవంతం కావాలని అభిలషించారు. శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ సీ52 ఉదయం 5 గంటల 59 నిమిషాలకు నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. మొన్న అంటే 25.30 గంటల కౌంట్‌డౌన్‌ అనంతరం..పీఎస్‌ఎల్‌వి రాకెట్‌ ద్వారా ఒకేసారి మూడు ఉపగ్రహాలైన ఆర్‌ఐశాట్‌-1, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌ -1 లను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img