Monday, May 6, 2024
Monday, May 6, 2024

28న వరంగల్‌లో రాహుల్‌ గాంధీ బహిరంగసభ

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 28,29న రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. 28న హన్మకొండలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. 29న హైదరాబాద్‌లో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వంలో తెలంగాణ టాప్‌గా నిలిచింది. 43 లక్షల డిజిటల్‌ సభ్యత్వాలు చేయగా ఎన్‌రోలర్స్‌ ఇందులో కీలకపాత్ర పోషించారు. వీరితో సమావేశం కానున్నారు రాహుల్‌ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే దిల్లీిలో రాష్ట్ర నేతలతో రాహుల్‌ సమావేశం కాగా జగ్గారెడ్డి, వీహెచ్‌ సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇక ఈ సమావేశంలో నేతలంతా ఒకేతాటిపై రావడం,ఐక్యంగా పనిచేయాలని నిర్ణయానికి రావడంతో కార్యకర్తలు జోష్‌ మీదున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img