Monday, May 6, 2024
Monday, May 6, 2024

అమెరికాతో చర్చలకు ఇరాన్‌ సిద్ధం

టెహ్రాన్‌ : అణు ఒప్పందంపై అమెరికాతో ‘తదుపరి దశ’ చర్చలకు ఇరాన్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 2015 అణు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి అమెరికాతో కొత్త పరోక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్‌ పేర్కొంది. ‘బంతి యుఎస్‌ కోర్టులో ఉంది. అమెరికా వాస్తవికంగా వ్యవహరిస్తే దాని బాధ్యతలను అమలు చేస్తే, ఒప్పందం అమలవుతుంది. ఇరాన్‌, యుఎస్‌ల మధ్య పరోక్ష చర్చలు ఖతార్‌లో గణనీయమైన పురోగతిని సాధించడంలో విఫలమైంది’ అని ఇరాన్‌ రాయబారి రావంచి వ్యాఖ్యానించారు. ఖతార్‌ చర్చలు తీవ్రమైనవి, సానుకూలమైనవిగా అభివర్ణించారు. తదుపరి దశ చర్యల కోసం ఇరాన్‌ యూరోపియన్‌ యూనియన్‌ కో ఆర్డినేటర్లను సంప్రదిస్తుందన్నారు. రావంచి ఖతార్‌ చర్చలను ‘‘తీవ్రమైన, సానుకూల చర్యలుగా’’ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img